ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు "స్వస్త్ నారి సశక్త పరివార్ అభియాన్", 8వ రాష్ట్రీయ పోషణ మాహ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఆరోగ్య అధికారి నాగరాజు తెలిపారు. కడప నగరంలోని డిఎంహెచ్ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడుతూ.. చిన్న పిల్లలు మొదలు వృద్ధ మహిళల వరకు సేవలను పొందడానికి మహిళలు మరియు పిల్లలు తమ సమీపంలోని ఆయుష్మాన్ ఆరోగ్య సెంటర్ లేదా అంగన్వాడీ కేంద్రాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు.