గద్వాల్ ఎమ్మెల్యే ఏ లింగమో ఆయనకే తెలియదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. జడ్చర్లలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. MLA కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లో ఉంటే పార్టీ ఆఫీసు, శాసనసభ సమావేశాలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఓటేసి గెలిపించిన ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన వారిని సస్పెండ్ చేసే వరకు వదిలిపెట్టమని స్పష్టం చేశారు