తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో, తెలంగాణ రాష్ట్ర సాధనతో తెలంగాణ పండుగలు విశ్వ విఖ్యాతమయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సోమవారం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొండపాక మండలం మర్పడ్గ గ్రామం లో వెలసియున్న శ్రీ విజయ దుర్గా సమెత శ్రీ సంతాన మల్లి ఖార్జున దేవాలయం లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని తెచ్చిన పండుగ అన్నారు. ప్రపంచంలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలోనే ఉందన్నారు. తెలంగాణ ఆడ