పార్వతిపురం మన్యం జిల్లా ఆసుపత్రిలో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సహాధ్యక్షులు బోనెల విజయ్ చంద్ర అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ నాగభూషణరావు, ఆసుపత్రి సూపరెంటెండెంట్ డాక్టర్ నాగశివజ్యోతి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, సభ్యులు, ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు పాల్గొని పలు అంశాలపై అభిప్రాయాలు తెలియజేశారు.