సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 2న దసరా సెలవు మార్చాలని ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కోరారు. గాంధీ జయంతి, దసరా పండుగ ఒకే తేదీన రావడంతో ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు నష్టం జరుగుతోందని తెలిపారు. ఉద్యోగుల హక్కులను పరిరక్షించేందుకు దసరా పండుగకు మరొక అనుకూలమైన తేదీని ప్రత్యామ్నాయ సెలవుగా ప్రకటించాలని యాజమాన్యాన్ని కోరారు.