ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గుండ్ల వాగు వద్ద అదుపుతప్పి ఓ కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ములుగు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది