Download Now Banner

This browser does not support the video element.

కనిగిరి: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేసిన కామ్రేడ్ బషీర్: సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ యాసిన్

Kanigiri, Prakasam | Aug 29, 2025
కనిగిరి పట్టణంలోని ఎన్జీవో భవనం నందు శుక్రవారం దివంగత రాష్ట్ర ఎన్జీవో సంఘ ఉపాధ్యక్షులు కామ్రేడ్ అబ్దుల్ బషీర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బషీర్ చిత్రపటానికి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ యాసిన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాసీన్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం వ్యక్తి అబ్దుల్ బషీర్ అన్నారు. ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేవారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us