పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహమ్మద్ ను ధర్మవరం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని తెలిపారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న నూరు మహమ్మద్ ను మూడు రోజుల విచారణలో భాగంగా బుధవారం ధర్మవరం పోలీసులు కస్టడీలో తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. నూర్ మొహమ్మద్ను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తీసుకొని వచ్చి పరీక్షలు నిర్వహించి అనంతరం విచారణలో భాగంగా రహస్య ప్రదేశానికి తరలించారు.