ముదిగుబ్బ మండలం ఓడ్డు కింద తండాలో తాపీ మేస్త్రి చేస్తున్న రంగనాయక కుటుంబంలో ముగ్గురు సంతానానికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. కుమారుడు శ్రీరామ్ నాయక్ 2018 లో డీఎస్సీ లో ఎస్జిటి ఉద్యోగం సాధించగా రెండవ కూతురు వనజాక్షి 2019లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించింది. ఇప్పుడు మూడవ కూతురు మీనాక్షి సైతం డీఎస్సీలో ఎస్జిటి సాధించింది. ఇలా ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.