మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు ఆర్కే 1 ఏరియాలో అమ్మవారు వెలిసింధని ప్రచారం జోరుగా సాగింది. పూజారి గోల సాయినాథ్, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం ఆర్కే 1 ఏరియాలో ప్రతి సంవత్సరం నవరాత్రుల సందర్భంగా దుర్గామాతను నెలకొల్పే మండపం వద్ద అమ్మవారి విగ్రహాన్ని వెలికి తీసినట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాల నుండి ఇక్కడ స్థలంలో అమ్మవారు విగ్రహ రూపంలో కొలువుదీరి ఉన్నట్లు రాత్రి సమయంలో అమ్మవారు కలలో వచ్చి చెప్పేవారని, ఈ క్రమంలోనే పూజారి సాయినాథ్ శుక్రవారం ఉదయం కలలో చెప్పిన మాదిరిగానే భక్తులతో కలిసి వెళ్ళి చూడగా అమ్మవారి విగ్రహం లభించిందన్నారు.