దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తే ఊరుకునేది లేదని ముదిగుబ్బలో సిపిఎం నాయకులు ఫైర్ అయ్యారు. మంగళవారం ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం కార్యదర్శి ఆటో పెద్దన్న ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం వీఆర్వో రేవతికి వినతి పత్రం ఇచ్చి తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలన్నారు.