ఎమ్మిగనూరు: గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి నీటి విడుదల..భారీ వర్షాల వల్ల గాజులదిన్నె ప్రాజెక్ట్ (సంజీవయ్య సాగర్)కు 200 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులో 376.86 మీటర్ల నీరు చేరింది. దీంతో 300 క్యూసెక్కుల నీటిని నాలుగో నంబర్ గేటు ఎత్తి, దిగువ హంద్రీలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజినీర్ మహమ్మద్ అలీ తెలిపారు.హంద్రీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.