గాలికుంటు వ్యాధికి ఉచితంగా అందించే టీకాలను మీ పశువులకు వేయించాలని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుముల వీడు పశువైద్య శాఖ అధికారి నాగమణి రైతులకు శుక్రవారం ఉదయం 10 గంటలకు తెలిపారు. గాలికుంటు వ్యాధి వల్ల పశువులకు జ్వరం వస్తుందని అలానే నీటి పొక్కులు లాగా ఏర్పడి జొల్లు కూడా వస్తుందన్నారు. అలానే పాలు ఇచ్చే పశువులకు పాలు తగ్గుతాయని అలానే పొదుగు వద్దకు కూడా నీటి పొక్కులు ఏర్పడతాయన్నారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాలలో ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుందని రైతులు పశువుల కాపర్లు అపోహలకు పోకుండా టీకాలు వేయించాలన్నారు.