కడప నగరంలోని 24వ డివిజన్‌లో 300 ఏళ్ల నాటి అబూ హురైరా మస్జీదు వక్ఫ్ భూమి (సర్వే నంబర్ 267) మొత్తం 1.68 ఎకరాలు ఉండగా, కాలక్రమంలో పెద్ద భవనాల ఆక్రమణకు గురై, కేవలం 44 సెంట్లు మాత్రమే మిగిలింది. ఆ స్థలం కూడా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. మసీదు కమిటీ సభ్యులు గత 20 ఏళ్లుగా పలుమార్లు అధికారులను, పాలకులను సంప్రదించినా పరిష్కారం లభించలేదు. అయితే ఈసారి వారు *టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారిని, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిని సంప్రదించి వాస్తవాలు తెలియజేశారు.