కామారెడ్డి జిల్లా ప్రజలు మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. ఈ నెల 26 వరకు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. డ్రగ్స్ శరీరాన్ని మాత్రమే నాశనం చేయదని, కుటుంబాన్ని జీవితాన్నే మార్చేస్తుందన్నారు. ప్రతి కుటుంబంలో తమ పిల్లలను వ్యసనాలకు బానిసలుగా మారకుండా చూసుకోవాలని అన్నారు.