చీరాల హారిస్ పేటకు చెందిన పేర్లి కోటేశ్వరరావు మృతి మిస్టరీ వీడింది.తన భార్యతో అక్రమ సంబంధం నేపథ్యంలో తానే కోటేశ్వరరావును హత్య చేశానంటూ హారిస్పేటకే చెందిన సలగల విజయ్ బాబు అనే వ్యక్తి చీరాల టూ టౌన్ సీఐ నాగభూషణం ఎదుట గురువారం లొంగిపోయాడు.దీంతో చట్ట ప్రకారం విజయ్ బాబును ఆయన అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.ఈ నెల 3న కోటేశ్వరరావు తన ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా మరణించగా చివరికి అది హత్యగా తేలింది.