5 వ తేదీన గణేష్ నిమజ్జనం సందర్భంగా కరీంనగర్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లింపు ఉంటాయని సిపి గౌష్ ఆలం గురువారం తెలిపారు. కొత్తపల్లి నిమజ్జనం పాయింట్ కరీంనగర్ వైపు వచ్చే వాహనాలను వెలిచాల ఎక్స్ రోడ్డు నుంచి సిరిసిల్ల బైపాస్ రోడ్డు కరీంనగర్ కు చేరుకోవాలి, అలాగే జగిత్యాల వైపు వెళ్లే వాహనాలు అవసరమైతే యూనివర్సిటీ నుంచి వెలిచాల ఎక్స్ రోడ్ కు వెళ్లాలన్నారు. చింతకుంట మార్గం యధావిధిగా నడుస్తుందన్నారు. మానకొండూరు నిమజ్జనం పాయింట్ వద్ద వరంగల్ నుంచి కరీంనగర్ వచ్చే వాహనాలు మానకొండూర్ ముంజంపల్లి తిమ్మాపూర్ నుంచి కరీంనగర్ చేరుకోవాలన్నారు.