ఎమ్మిగనూరు , గోనెగండ్ల లో అంగన్వాడీ వర్కర్స్ నిరసన...సోమప్ప కూడలిలో అంగన్వాడీ వర్కర్స్ మానవహారం..ఎమ్మిగనూరులోని సోమప్ప ప్రధాన కూడలిలో అంగన్వాడీ వర్కర్స్ ఆధ్వర్యంలో గురువారం మానవహారం నిర్వహించారు. యూనియన్ అధ్యక్షురాలు గోవర్ధనమ్మ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేపట్టినప్పుడు వేతనాలు పెంచాలని అడగ్గా మినిట్స్ ఇచ్చారని, ఇప్పటివరకు అది అమలు చేయలేదని అన్నారు.ఇప్పటి ప్రభుత్వం వేతనాలు పెంచి, FRS రద్దు చేసి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.