ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 33 లక్షల విలువైన చెక్కులను 14 మంది లబ్ధిదారులకు ఈరోజు శుక్రవారం ఉదయం 11 గంటలకు వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామంలోని ఆయన స్వగృహం నందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాణాప్రాయ స్థితిలో అనారోగ్య బారిన పడిన వారికి ఈ పథకం ఓ వరం లాంటిదని ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ఆదుకోవడమే తమ కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్నారు.ఆ తర్వాత చెక్కులు పొందిన లబ్ధిదారులు మాట్లాడుతూ, తమను ఆర్థికంగా ఆదుకున్న ఎన్డీఏ కుటమికి ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.