బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు ఔత్సాహికపరులు అందరూ ముందుకు రావాలని జిల్లా ఎక్సైజ్ అధికారి వెంకటేశ్వర్లు కోరారు.గురువారం సాయంత్రం చీరాల ఎక్సైజ్ స్టేషన్లో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారులు,రిసార్ట్స్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు సంబంధించిన నియమ నిబంధనలని ఆయన వారికి వివరించారు.లాటరీ పద్ధతిలో ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పారు.సిఐ నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.