హుస్నాబాద్ కి ఇంజనీరింగ్ కాలేజీ రావడానికి చాలా కృషి ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. అనంతరం హుస్నాబాద్ లో నూతనంగా ఏర్పడిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ లో మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని నలుమూలల నుండి విద్యార్థులు హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరడంతో మంత్రి పొన్న