మందమర్రి పట్టణంలో భారీ కొండ చిలువ శుక్రవారం రాత్రి కలకలం రేపింది. స్థానిక ప్రాణహిత కాలనీలో రోడ్డు పక్కన ఉన్న పొదల్లో నుంచి కొండ చిలువ బయటకు వచ్చింది. ఆ సమయంలో మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వారు ఎక్కడి వారు అక్కడే ఆగి తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. దాదాపు రోడ్డు పొడవు ఉన్న కొండ చిలువ నెమ్మదిగా రోడ్డు దాటి పొదల్లోకి వెళ్ళిపోయింది.