చీరాల నియోజకవర్గ పరిధిలోని బీచ్ లలో పర్యాటకులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని టిడిపి అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాధ్ చెప్పారు.బుధవారం సాయంత్రం ఆయన వాడరేవు,రామాపురం బీచ్ లను సందర్శించి అక్కడ నిర్మిస్తున్న టాయిలెట్లు, వెయిటింగ్ రూముల పనుల పురోగతి ని పరిశీలించారు.త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను కోరారు.బీచ్ ల అభివృద్ధి కి అవసరమైన నిధులను ఎమ్మెల్యే కొండయ్య మంజూరు చేయిస్తారన్నారు.