నగరంలోని 34వ వార్డు కొబ్బరితోట ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బుధవారం క్రేజీబాయ్స్ సంఘం ఆధ్వర్యంలో 55 రకాలతో భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వినాయకుడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మోస్తున్నట్లు తీర్చిదిద్దిన విగ్రహం వద్ద కొద్ది రోజులుగా పూజలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ వెండి వినాయకుడిప్రతిమ, రెండు లీటర్ల శీతలపానీయం, నీళ్ల సీసా, లస్సీ, బాదంమిల్క్, గోలీసోడా, ఐదు రకాలతో కూడిన స్వీట్బాక్స్, బిర్యాని, పులిహోర, పలు రకాల కూరలు, పచ్చళ్లు తదితర పదార్థాలతో భోజనం వడ్డించారు. సుమారు 2,500 మందికి అన్నదానం చేశామని క్రేజీబాయ్స్ సంఘం ప్రతినిధి వినయ్ తెలిపారు.