ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ దేవదాస్ అన్నారు. జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని కాజిపల్లి గ్రామంలో 181 సర్వే నంబర్ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగించారు. స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. జెసిబి సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ జయప్రకాష్ నారాయణ, సిబ్బంది తదితరులు ఉన్నారు.