రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, జిల్లెల్ల గ్రామంలో ప్రధాన రహదారిపై ధర్నాకు దిగిన రైతులు. జిల్లెల్ల గ్రామం లోని సిరిసిల్ల, సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతులు బయటయించి రైతులకు సరిపడా యూరియా అందించాలని ధర్నాకు దిగారు. వారికి సంఘీభావంగా బిఆర్ఎస్ నాయకులు బయట నుంచి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు మాట్లాడుతూ రైతులు యూరియా కోసం ఉదయం నుండే షాప్ ల వద్ద లైన్లలో నిలబడుతున్నారని అన్నారు. రైతులకు కావలసిన యూరియా ప్రభుత్వం ఇవ్వడంలో విఫలమైందని వెంటనే సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశ