దెబ్బతిన్న రోడ్డు పై మరమ్మత్తులు చేశారు కాజీపేట పోలీసులు కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాతిమా జంక్షన్ వద్ద అలాగే కాజీపేట బ్రిడ్జి వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి పై గుంతలు ఏర్పడ్డాయి దీంతో ప్యాచ్ పనులు చేపట్టారు పోలీసులు ఈ రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి ఈ గుంతల వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువ గా సంభవించేవి ప్రజల విజ్ఞప్తి మేరకు మరియు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు పోలీస్ శాఖ ఈ పనులను చేపట్టింది.