అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో నాయి బ్రాహ్మణులు శనివారం ఆందోళన చేశారు. పట్టణంలో కార్పొరేట్ సంస్థ నాయి బ్రాహ్మణ కులవృత్తులకి వచ్చి సెలూన్, స్పా పేరిట షాపు ఏర్పాటు చేయడంపై నాయి బ్రాహ్మణులు భగ్గుమన్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ సెలూన్ ఎదుట నాయి బ్రాహ్మణులు నిరసన తెలిపి జరుగుతున్న పనులను అడ్డుకొని నిలిపివేశారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులు మాట్లాడుతూ పట్టణంలో కార్పొరేట్ కంపెనీ సెలూన్ పెట్టడంతో రెండు వేల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.