చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో దాదాపు 45 సంవత్సరాల అనాధ వ్యక్తి యాచకం చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ నేపథ్యంలో ఆయన గత రెండు రోజుల క్రితం బి ఎం ఎస్. క్లబ్ ఆవరణంలో అపస్మారక స్థితిలో ఉండడాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటన స్థలానికి ఏఎస్ఐ. అశ్వత నారాయణ చేరుకొని చికిత్స నిమిత్తం అనాధ ను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉండడానికి గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపారు.