ఎన్నికల్లో పెన్షన్ దారులను రేవంత్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని MRPS రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గాలివారి గూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ పెంపు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధనవంతుడైన రేవంత్, గడిలో పుట్టిన కేసీఆర్కు పేద వర్గాలైన పెన్షన్ దారులకు ప్రేమ లేదన్నారు.