కరీంనగర్ రాంనగర్ వద్ద 35 అడుగుల భారీ వినాయకుడు నిమజ్జనానికి అనేక అడ్డంకులు, విద్యుత్ శాఖ, నిమజ్జన ఏర్పాట్లు చూసే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆలస్యం,ఎట్టకేలకు శనివారం నిమజ్జనం పూర్తి చేసిన నిర్వాహకులు. నిన్న నిమజ్జనం కానున్న గణనాథుడు భారీ ఎత్తు వల్ల శనివారం చేయాలని జిల్లా కలెక్టర్ సూచన మేరకు నిమజ్జనానికి బయలుదేరిన వినాయకునికి రాంనగర్ ప్రధాన చౌరస్తా వద్ద, విద్యుత్ తీగలు,సీసీ కెమెరాల కోసం ఏర్పాటుచేసిన స్తంభం అడ్డు రావడంతో కాసేపు నిమజ్జనం ఆలస్యమైంది. విద్యుత్ నిలిపివేసి, విద్యుత్ తీగల ను పక్కకు జరిపి వినాయకుడిని అతి కష్టం మీద నిమజ్జనం పూర్తి చేశారు.