సూర్యలంకలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ నడుపుతున్న హరిత రిసార్ట్స్, టీటీడీ,శ్రీశైలం తదితర ప్రముఖ ఆలయాల పేరిట నకిలీ వెబ్సైట్లు రూపొందించి ప్రజలను మోసగిస్తున్న రాజస్థాన్ కు చెందిన ఇద్దరు సైబర్ నేరగాళ్ళను అరెస్టు చేసినట్టు శుక్రవారం ఎస్పి తుషార్ డూడీ మీడియాకు చెప్పారు.వీరి మీద దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలలో 127 ఫిర్యాదులు సైబర్ క్రైమ్ విభాగానికి అందాయని ఆయన వివరించారు.దాదాపు 50 లక్షల రూపాయల మేర వారు ప్రజలకు టోకరా వేశారన్నారు. బాపట్ల జిల్లా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారిని పట్టుకున్నారని ఎస్పీ తెలిపారు