బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో వేల్పూర్ మండలం మోతె మరియు అక్లూర్ గ్రామాల రైతులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారికి చెక్ డ్యాంలను నిర్మూలించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. చెక్ డ్యాంల వల్ల తాము జీవితకాల నష్టాన్ని చవిచూస్తున్నామని చెక్ డ్యామ్ లో సరైన డిజైన్ లేకుండా మరియు నాసిరకంగా నిర్మించడం ద్వారా వర్షాకాలం వచ్చిందంటే తమ పంటలే కాదు భూములు సైతం కొట్టుకుపోతున్నాయని వారు వాపోయారు. కప్పల వాగుపై నిర్మించిన చెక్ డ్యాం వల్ల 2020 సంవత్సరం నుండి ఇప్పటివరకు ప్రతి వర్షాకాలం తమ పంటలు నాశనం అవుతున్నాయనీ తెలిపారు.