మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం, సీఎం సహాయనిధి ద్వారా మొత్తం రూ. 5 లక్షల 500 విలువైన చెక్కులను లబ్ధిదారులకు మంత్రి డా. వాకిటి శ్రీహరి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని, ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గణేష్ కుమార్, విగ్నేశ్వర్ రెడ్డి, రాజప్ప గౌడ్, నాయకులు పాల్గొన్నారు.