తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు బుధవారం పాలకుర్తిలో ఘనంగా నిర్వహించారు.రాజీవ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో MLA యశస్విని రెడ్డి పాల్గొని,ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు హక్కుల కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకం అని,ఆ కాలంలో సమాజంలో ఉన్న అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కొని,భూస్వాముల అణచివేతకు ప్రతిఘటించి చరిత్రలో నిలిచారన్నారు.సమానత్వం కోసం చేసిన ఆమె పోరాటం తరతరాలకు ఆదర్శం” అని పేర్కొన్నారు..