వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని భద్రకాళీ దేవాలయం మాఢ వీధుల నిర్మాణం, కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్ధరణ పనులు, వేయి స్తంభాల దేవాలయం, సివిల్ సప్లై గోదాంలు, కాజీపేట ఆర్ఓబి, తదితర అభివృద్ధి అంశాలపై సమీక్ష సమావేశం