బండ్లపల్లిలో 20 రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో రైతులు స్వయంగా బాగు చేయించుకుని తీసుకువచ్చినప్పటికీ, దానికి కనెక్షన్ ఇవ్వడానికి స్థానిక లైన్మెన్ నిరాకరిస్తున్నాడు. ఈ విషయంపై లైన్మెన్ను సంప్రదించగా, 'మీరే కనెక్షన్ ఇచ్చుకోండి' అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని రైతులు ఆరోపించారు. 20 రోజులుగా పొలాలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, ఆ లైన్మెన్్ప తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.