జిల్లాలో వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎస్పి తుషార్ డూడీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖ నుండి 2500 విగ్రహాలకు జిల్లాలో అనుమతులు ఇచ్చామన్నారు.రోజువారీగా నిమజ్జనాలు జరుగుతుండగా పోలీసు శాఖ గట్టి భద్రతా చర్యలు చేపట్టిందని తెలిపారు. డ్రోన్ సాయంతో జిల్లా వ్యాప్తంగా నిఘా కూడా పెట్టామన్నారు.సముద్ర తీరాల్లో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామన్నారు.భక్తులు కూడా ప్రజలకు సహకరించాలని కోరారు.