నస్పూర్ సీసీసీలోని రాయల్ టాకీస్ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కస్తూరి గోపి అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేసే గోపి రాత్రి నడుచుకుంటూ ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న108 వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. పోలీసులు విచారణ చేపట్టారు.