గుంతలమయమైన రోడ్డులో వర్షాకాలం జరుగుతున్న ప్రమాదాల నివారణకు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు నడుం బిగించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం మందమర్రి ఏరియాలోని పాలచెట్టు దగ్గర ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు అజీముద్దిన్, జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్ లు మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో తాత్కాలికంగా గుంతలకు మరమ్మతులు చేపట్టామని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి పూర్తిస్థాయిలో పనులు చేపట్టాలని కోరారు.