మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఉదయం ఉచిత పిజియోతెరపి క్యాంప్ ను వైద్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కన్వినర్ డాక్టర్ అజయ్ మాట్లాడుతూ ప్రపంచ పిజియోతెరపి దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత అవగాహన క్యాంప్ నిర్వహిస్తున్నామని పిజియోతెరపి చేసేందుకు ఎలాంటి వయస్సుతో సంబంధం లేదనీ, దీర్ఘకాలిక వ్యాధుల నిర్మూలనకు పిజియోతెరపి ఉపయోగపడుతుందని తెలిపారు. రోజు మనం చేసే దినచర్య కూడా పిజియోతెరపిలో భాగమని ప్రతీ ఒక్కరూ పిజియోతెరపిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.