దుబ్బాక మండలంలో జిల్లా కలెక్టర్ కె.హైమావతి శుక్రవారం పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా దుబ్బాక మండలం లోని రామక్కపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి "స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్" కార్యక్రమంలో భాగంగా పిఎచ్ సి చేస్తున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రత్యేకమైన వైద్య నిపులనచే జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్, ఆప్తాల లిస్ట్, దంత వైద్యులు, చెవి ముక్కు గొంతు, చర్మవ్యాధుల, మానసిక వైద్య నిపుణులు ద్వారా 14 రకాల ఆరోగ్య సేవలు అందిస్తారనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ప్రతి ఒక్క మహిళ తమ ఆరోగ్యా