సాలూరు నియోజకవర్గం లోని మెంటాడ మండలంలో 7గ్రామాలకు చెందిన 16మంది విద్యార్థులకు సైకిళ్లు, స్కూల్ బ్యాగులు, నోటు పుస్తకాలు, వాటర్ బాటిల్ల తోపాటు రైతులకు తూనిక యంత్రాలు పంపిణీ చేశారు. మండలంలోని లోతుగెడ్డ పంచాయతీలో ఉన్న ఎర్రవానివలస గ్రామంలో సోమవారం సాయంత్రం బ్రెడ్స్ సంస్థ సీఈవో రామకృష్ణంరాజు ఆధ్వర్యంలో ఎంపీడీవో భానుమూర్తి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సర్పంచ్ భీమారావు, ఉప సర్పంచ్ పైడిపునాయుడు తదితరులు పాల్గొన్నారు.