జిల్లాలోని గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో జరుగుతున్న వరుస మరణాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పందించారు. శుక్రవారం సాయంత్రం తురకపాలెం గ్రామాన్ని మంత్రి సందర్శించారు. జరుగుతున్న మెడికల్ క్యాంప్ ను పరిశీలించారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న సిపిఐ నేతలు జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి పలువురు నాయకులు మంత్రి సత్య కుమార్ ను కలిసి గ్రామంలో మరణాలకు సంబంధించి పలు సూచనలు చేశారు. తక్షణమే గ్రామానికి శుద్ధి కలిగిన మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.