సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఎస్పీ మహేష్ బి. గీతే ప్రత్యేక పూజలు చేపట్టారు. వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయగా ఎస్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజ్ఞేశ్వరుడు జిల్లా ప్రజలందరినీ సుఖ,సంతోషాలు శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరారు.