కొయ్యూరు మండలంలోని మఠం భీమవరం పంచాయతీ బొడ్డుమామిడిలంక గ్రామానికి చెందిన చెందిన కెచ్చల బొడ్డయ్య (46)ను అతడి కుమారుడు లోవరాజు (26) హతమార్చాడని మంప ఎస్సై కే.శంకరరావు శుక్రవారం తెలిపారు. మృతుడు బొడ్డయ్య తరచూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో తండ్రి కొడుకుల మధ్య తరచూ వివాదం జరిగేదని తెలిపారు. ఈక్రమంలో బుధవారం రాత్రి తల్లితో గొడవ పడుతున్న తండ్రిని చూసి ఆగ్రహించిన లోవరాజు, తండ్రి తలపై చెక్కపీటతో కొట్టగా మృతి చెందాడన్నారు. ముద్దాయి పరారీలో ఉన్నాడని తెలిపారు.