గంగవరం: మండలంలోని నాలుగు రోడ్లు వద్ద ఛత్తీస్గర్ కు చెందిన దంపతులు ఓ హేచరిస్ లో పని చేస్తున్నారు. వీరి ఏడాదిన్నర బాబుని అపస్మారక స్థితిలో ఆరోగ్యం బాలేదని పలమనేరు ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా పరిశీలించిన వైద్యులు ఒంటిపై,మర్మాంగాలపై పంటి గాట్లు ఉండటంతో వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఈ విషయమై తల్లిదండ్రులను ప్రశ్నించగా బాలుడిని 13 ఏళ్ల బంధువు వద్ద వదిలివెళ్లామని ఏమి జరిగిందో తెలియదని సమాధానమిచ్చారు. అధికారుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.