అనంతగిరి మండలం, జీనాబాడు పంచాయతీ,జీనబాడులో మండల అధ్యక్షులు అంటిపర్తి బుజ్జి బాబు అధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు, జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పర్యటించి వృద్ధులకు వితంతులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం గ్రామస్థులు తో మాట్లాడి గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అలాగే ప్రజలందరికీ మంచి జరగాలని కోరుతున్నానని అన్నారు.