నారాయణపేట జిల్లా కృష్ణ రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మహబూబ్నగర్ రైల్వే ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మెరూన్ కలర్ షర్ట్, బ్లూ ప్యాంట్ ధరించిన 50 ఏళ్ల మగ వ్యక్తి తలకు బలమైన గాయమై రైల్వే పట్టాలపై పడి ఉండటాన్ని స్థానికులు గమనించి, విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఘటన స్థలానికి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.