మహబూబ్ నగర్ జిల్లా 6న మూసాపేట మండల కేంద్రం లో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం లో రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తారని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు శుక్రవారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మూసా పేట లో ఇందిరమ్మ గృహ ప్రవేశం చేయనున్న లబ్ధిదారురాలు ఉప్పరిపల్లి ప్రమీల గృహాన్ని,పబ్లిక్ మీటింగ్ ఏర్పాట్లు పరిశీలించారు.గృహ ప్రవేశం పబ్లిక్ మీటింగ్ వద్ద వేదిక,సీటింగ్ అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వద్ద పరిశుభ్రత చర్యలు త